News October 22, 2024
జల వనరుల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా విశాఖ

జల వనరుల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా విశాఖ ఎంపికైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ నీటి అవార్డును విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అందుకున్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.
Similar News
News November 22, 2025
కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

కంచరపాలెం రైతు బజార్‌కు 880 గ్రాములు క్యారేట్‌ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్‌ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.
News November 22, 2025
విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.


