News April 7, 2025

జవహర్‌నగర్‌లో విషాదం.. యువకుడి సూసైడ్

image

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని సాయి పవన్(28) సూసైడ్ చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. జవహర్‌నగర్‌కు చెందిన సాయి కొంతకాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో పెద్దలతో తగదా వచ్చి మేడిపల్లిలోని అమ్మాయి బంధువుల ఇంటి ముందు ఉగాది రోజు పవన్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా ఈరోజు మరణించాడు.

Similar News

News November 16, 2025

WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

image

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.

News November 16, 2025

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: యూటీఎఫ్

image

వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు డిమాండ్ చేశారు. సూర్యాపేట యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడారు. 2023 జులై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News November 16, 2025

పార్వతీపురం: ‘సివిల్స్‌ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

image

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.