News September 28, 2024

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు భారం తగ్గేలా చర్యలు

image

ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్‌లో 85, మల్కాపూర్‌లో 200ఎకరాలను గుర్తించింది.

Similar News

News November 8, 2025

ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో శాండ్‌ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్‌ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్‌ ఉంటుంది.

News November 8, 2025

జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

image

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.