News February 5, 2025

జవహర్‌నగర్: స్ట్రాబెర్రీల రూపంలో డ్రగ్స్ సరఫరా.!

image

డ్రగ్స్‌‌ను రకరకాల రూపాలతో కొందరు నేరస్థులు తయారు చేసి సరఫరా చేస్తుండగా ఇప్పుడు సరికొత్త రూపంలో బొమ్మల రూపంలో తయారు చేసి స్కూల్స్ వద్ద అమ్ముతున్నట్లు ఒక వాయిస్ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు చాక్లెట్ల రూపంలో సరఫరా చేస్తుండగా ప్రస్తుతం కొందరు నేరస్థులు చిన్న బొమ్మల రూపంలో తయారుచేసి స్కూల్స్ వద్ద అమ్ముతున్నట్లు ఒక ఫొటోతో సహా చక్కర్లు కొడుతోంది. 

Similar News

News February 18, 2025

డ్రైనేజీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కమిషనర్ 

image

డ్రైనేజీ నిర్మాణానికి ప్రజల సహకరించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో డ్రైన్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానికుల సౌకర్యార్థం డ్రైన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానికులతో పాటు సదరు యజమాన్యం సహకరించాలని, వారికి న్యాయం చేస్తామని కమిషనర్ తెలిపారు.

News February 18, 2025

వరంగల్ మార్కెట్లో పలు ఉత్పత్తుల ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మంగళవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11 వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,200, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే నం. 5 రకం మిర్చి రూ.12 వేలు, ఇండికా మిర్చికి రూ.16,200, మక్కలు(బిల్టీ)కి రూ.2,311 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 18, 2025

SHOCKING.. కుంభమేళాలో నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా

image

కుంభమేళా వేళ గంగా నదిలో నీటి నాణ్యతపై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆందోళన రేకెత్తించే అంశాలను వెల్లడించారు. ఈ నీళ్లలో చర్మానికి హానిచేసే కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని NGTకి తెలిపింది. ప్రతి 100mm నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే స్నానం చేయవచ్చని CPCB చెబుతోంది. కాగా దీనిపై విచారణను NGT రేపటికి వాయిదా వేసింది.

error: Content is protected !!