News December 11, 2024

జవాన్ మృతిపై స్పందించిన మంత్రి అనిత

image

జమ్మూలో ల్యాండ్ మైన్ పేలి వీరమరణం పొందిన కంభం మండలం <<14838717>>రావిపాడుకు చెందిన జవాన్ <<>>వరికుంట్ల సుబ్బయ్యకు బుధవారం మంత్రి అనిత సంతాపం తెలిపారు. సైన్యంలో 23 ఏళ్లు సేవలందించిన సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయిన వార్త కలచివేసిందన్నారు. కానీ, మృత్యువు చేరువైందని తెలిసినా గో బ్యాక్ అంటూ సహచర జవాన్లను అప్రమత్తం చేసి తనువు చాలించారని, జవాన్ సుబ్బయ్య సాహసం ఆదర్శమని మంత్రి అనిత తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

Similar News

News December 27, 2024

 అభ్యంతరాలు ఉంటే 31లోపు తెలపండి: కలెక్టర్ 

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీనిపై జిల్లాలోని ఎస్సీ పౌరులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు సచివాలయాల్లో అందించాలని తెలిపారు.

News December 26, 2024

ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య

image

జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్‌గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2024

ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం

image

ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.