News June 5, 2024

జహీరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన BRS

image

MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

Similar News

News November 1, 2025

మెదక్: బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతలు వీరే..

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్‌లో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతలు వీరే. ఓపెన్‌ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్‌లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

News October 31, 2025

మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

image

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్‌లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

News October 31, 2025

తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.