News March 30, 2025
జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.
Similar News
News October 22, 2025
RARE PHOTO: ఆకాశంలో అద్భుతం

అత్యంత అరుదుగా కనిపించే రెడ్ స్ప్రైట్స్(ఎర్రటి మెరుపులు) న్యూజిలాండ్‌లో ఆవిష్కృతమయ్యాయి. NZ ఫొటోగ్రాఫర్ టామ్ రే, స్పానిష్ ఫొటోగ్రాఫర్స్ జఫ్రా, జోస్ సౌత్ ఐలాండ్‌లో మిల్కీ వే చిత్రాలు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఊహించని దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. తుఫానుల సమయంలో ఆకాశంలో ఏర్పడే ఈ రెడ్ స్ప్రైట్స్ 90KM ఎత్తు వరకు వెళ్తాయి. రెప్పపాటులో కనుమరుగయ్యే ఈ మెరుపులను చిత్రీకరించడం ఎంతో కష్టం.
News October 22, 2025
పాల్వంచ: ఈనెల 24న జాబ్ మేళా..

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెక్నీషియన్, ట్రైనీ టెక్నీషియన్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ లేదా ఐటీఐ చేసిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యా అర్హత పత్రాలతో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.
News October 22, 2025
థాంక్స్ చెబుతూనే మోదీ చురకలు!

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పీఎం మోదీ <<18069464>>థాంక్స్ చెప్పిన <<>>విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధన్యవాదాలు చెబుతూనే ట్రంప్‌కు చురకలు అంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఐక్యంగా వ్యతిరేకించాలంటూ ప్రధాని హితవుపలికారు. పాక్‌ను ట్రంప్ సపోర్ట్ చేస్తుండటాన్ని పరోక్షంగా గుర్తు చేశారని, ఇదే సమయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.