News March 16, 2025

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.

Similar News

News March 16, 2025

పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి టీజీ భరత్

image

రాష్ట్ర సాధన కోసం కఠోర దీక్ష చేసి తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని కర్నూలులోని పూల బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు నిర్విరామంగా అమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.

News March 16, 2025

ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

image

ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2025

రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

image

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!