News March 16, 2025
జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.
Similar News
News November 7, 2025
వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
News November 7, 2025
తరచూ ఛాతి ఎక్స్రేలు తీయించుకుంటున్నారా?

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News November 7, 2025
నిజామాబాద్: మలావత్ పూర్ణకు పితృ వియోగం

అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


