News March 7, 2025

జహీరాబాద్‌లో విషాదం.. పొలంలో విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

image

జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్‌కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ఇదే కుటుంబానికి చెందిన తండ్రి నాగన్న పాము కాటుకు గురై మరణించడం గమనార్హం.

Similar News

News March 9, 2025

న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం: హత్యాచార బాధితురాలి తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్‌కి జనవరి 20న సెషన్ కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలామంది ఉన్నారంటూ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం PM మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.

News March 9, 2025

లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.

News March 9, 2025

RRRకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ: కిషన్ రెడ్డి

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు త్వరలో PM మోదీ భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు లేవన్నా తానే నితిన్ గడ్కరీని ఒప్పించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుందని తెలిపారు. RRRకు తమ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం రూ.100కోట్లే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు.

error: Content is protected !!