News June 3, 2024
జహీరాబాద్ ఓట్ల లెక్కింపు.. 98 టేబుళ్లు- 145 రౌండ్లు

జహీరాబాద్ ఎంపీ ఓట్ల లెక్కింపునకు గీతం వర్సిటీలో మొత్తం 98 టేబుళ్లు- 145 రౌండ్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉన్న జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి సెగ్మెంట్లల్లో లెక్కింపు ప్రక్రియ తొలుత పూర్తి కానుంది. చివరిలో అందోల్, జహీరాబాద్ ఫలితాలు తేలనున్నాయి. అందోల్, జహీరాబాద్లో 23 రౌండ్లలో లెక్కింపు కారణంగా 5:30గ.కు పైగా సమయం పట్టనుంది. విజేత ఎవరో మధ్యాహ్నం తెలిసే అవకాశం ఉంది.
Similar News
News November 3, 2025
మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.
News November 3, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాలినడకన వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. కాలినడకన వెళ్తున్న చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
News November 3, 2025
మెదక్: 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.


