News February 26, 2026
జహీరాబాద్: జాతీయ స్థాయి శిక్షణకు సర్పంచ్ శివమణి

మహిళా సాధికారతపై జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎంపికైన ఐదుగురు సర్పంచులలో ఈమె ఒకరు. తక్కువ కాలంలోనే గ్రామాభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 25న జరిగే ఈ శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.
Similar News
News April 18, 2026
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 18, 2026
కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.