News April 12, 2024
జహీరాబాద్: పల్లెల్లో ఎన్నికల సందడి.. పార్టీలపై చర్చ..!

పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. రచ్చబండ వేదికగా గ్రామాల్లోని పెద్దమనుషులు పార్టీల పనితీరు బెరీజు వేస్తూ ఓట్లు ఎవరికి వేయాలో చర్చించుకునే పనిలో పడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలావరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో మేజర్ పంచాయతీలపై పార్టీల అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ఇప్పటి నుంచే మంతనాలు చేస్తున్నారు.
Similar News
News March 24, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ వార్

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నారు. మరి మీ కామెంట్..
News March 24, 2025
MDK: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.
News March 24, 2025
ఏషియన్ పోటీలకు మెదక్ జిల్లా క్రీడాకారిణి ఎంపిక

ఏషియన్ అండర్ 15 మహిళల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి సాయి సిరి ఎంపికైనట్లు మెదక్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. జనవరిలో భారత జట్టు ఎంపిక ప్రక్రియలో సాయి సిరి ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల తైవాన్‌లో 26 నుంచి 30 వరకు జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనున్నారు.