News May 13, 2024
జహీరాబాద్ పార్లమెంట్ లో 12.88 శాతం పోలింగ్ నమోదు
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటల వరకు 12.88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 15.71 శాతం, జుక్కల్ లో 12.58 శాతం, ఎల్లారెడ్డి లో 14.17 శాతం, కామారెడ్డిలో 12.49 శాతం, నారాయణ ఖేడ్ లో 12.71 శాతం, ఆందోల్ లో 11.48 శాతం, జహీరాబాద్ నియోజవర్గంలో 11.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
Similar News
News January 22, 2025
కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే: కవిత
బీఆర్ఎస్ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని నిజామాబాద్ MLC కవిత అన్నారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం BRS పార్టీదని, BRS కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా BRS కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు.
News January 22, 2025
దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి: NZB కలెక్టర్
గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ప్రత్యేకించి అద్దె ఇంట్లో ఉన్నామని వచ్చే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.
News January 22, 2025
నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లాలో తూంపల్లి 11.1, జాకోరా 11.9, చందూర్ 12.0, నిజామాబాద్ సౌత్, కోటగిరి 12.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.