News April 24, 2024

జహీరాబాద్: బీబీ పాటిల్ ఆస్తులు ఇవే..!

image

జహీరాబాద్ BJP అభ్యర్థి బీబీ పాటిల్‌ తన కుటుంబ ఆస్తులు రూ.151.69 కోట్లగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. వివిధ సంస్థల్లో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు, పాటిల్‌ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. 18 వాహనాలు, 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 129.4 తులాల బంగారం, 1.93కిలోల వెండి ఉంది. 61.10 ఎకరాల వ్యవసాయ, 65.8 ఎకరాల వ్యవసాయేతర భూమి, 2 వాణిజ్య భవనాలు, 3.52కోట్ల అప్పులు ఉన్నాయి.

Similar News

News January 16, 2025

3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

News January 16, 2025

గజ్వేల్: అనాథలైన ముగ్గురు పిల్లలు

image

సిద్దిపేట జిల్లా బంగ్లావెంకటాపూర్ గ్రామంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. దర్శనం నర్సింలు-నాగమణి దంపతులకు ముగ్గురు కొడుకులు. నర్సింలు మతిస్తిమితం కోల్పోయి తిరుగుతుండగా.. ఆయన భార్య ఈ నెల 5న కిడ్నీ వ్యాధితో చనిపోయింది. దీంతో వారి పిల్లలు రాజేందర్(7), హరికృష్ణ(5), చందు(3) అనాథలుగా మారారు. వీరికి వృద్దురాలైన అమ్మమ్మ మాత్రమే తోడుగా ఉంది. దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News January 15, 2025

మెదక్: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.