News January 10, 2026

జాగ్రత్తలతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి: ADB SE

image

సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగిరే వేసేటప్పుడు విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదిలాబాద్ SE శేషరావు రాథోడ్ సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల వద్ద పతంగులు ఎగురవేయడం ప్రమాదకరమన్నారు. ఒకవేళ విద్యుత్ వైర్లపై పతంగులు, మాంజాలు చిక్కుకున్నా లేదా విద్యుత్ వైర్లు తెగి కింద పడినా వాటిని తాకకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని వివరించారు.

Similar News

News January 20, 2026

ఈపూరుపాలెం పీహెచ్‌సీలో మలేరియా అధికారి తనిఖీ

image

ఈపూరుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి వి.నాగార్జునరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ రికార్డులు పరిశీలించి, రక్త పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో దోమల నివారణకు చేపట్టిన మలాథియన్ స్ప్రేయింగ్ పనులను ఆయన పర్యవేక్షించారు.

News January 20, 2026

షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

image

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News January 20, 2026

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/