News August 14, 2024

జాజిరెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

జాజిరెడ్డిగూడెం మండలం వేల్పులచర్ల వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బైక్ కింద పడడంతో  వెనకాల కూర్చున్న గోల్కొండ లక్ష్మమ్మ  మృతి చెందింది. భర్త బాలనర్సయ్యకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో  రోడ్డుపై పడిఉన్న ఆమెను భర్త ఒడిలోకి తీసుకొని భర్త కన్నీరుమున్నీరయ్యాడు. రోదిస్తూ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన తీరు గుండెలను పిండేసింది.

Similar News

News December 10, 2025

NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

image

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది

News December 10, 2025

NLG: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా తుంగతుర్తిలో గుడితండకు చెందిన జైపాల్ నాయక్, రుస్తాపురానికి చెందిన శ్రీహరికుమార్ బాండు పేపర్ రాసిచ్చిన విషయం తెలిసిందే. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.

News December 10, 2025

NLG: 829 జీపీల్లో రేపే పోలింగ్

image

జిల్లాలో మూడు విడతల్లో 869 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి మంగళవారం ప్రచార ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.