News December 30, 2024
జాతరను తలపించేలా భద్రాద్రిలో ముక్కోటి ఉత్సవాలు
భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమై 2025 జనవరి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నందున భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి రామయ్య దశావతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలు జాతరను తలపించేలా ఉండనున్నాయి.
Similar News
News January 6, 2025
గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వదిలేసింది: పొంగులేటి
హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది శూన్యమన్నారు. ఇళ్ల నిర్మాణం చేసి మొండిగా వదిలేసిందన్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు.
News January 6, 2025
KMM: 98.15శాతం పంపిణీ పూర్తి: బాల మాయాదేవి
అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఓటరు జాబితా ఉండాలని ఖమ్మం ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి.బాల మాయదేవి సూచించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో 98.15% ఓటర్ కార్డులు పంపిణీ పూర్తి చేశామని, చనిపోయినవారి పేర్లు తొలగించామని అదనపు కలెక్టర్ తెలిపారు. బీసీ గురుకులాల్లో కామన్ డైట్ అమలు పర్యవేక్షించాలని అబ్జర్వర్ సూచించారు. ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని అన్నారు.
News January 6, 2025
KTRకు ACB నోటీసులివ్వడం శోచనీయం: వద్దిరాజు
న్యాయస్థానం పరిధిలో ఉన్నా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ఏసీబీ అధికారులు విచారణకు పిలవడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తప్పుబట్టారు. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో KTRపై అక్రమ కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ కేసు వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని కోరడం శోచనీయం అన్నారు.