News March 30, 2025
జాతర గోడపత్రుల ఆవిష్కరించిన ASF ఎమ్మెల్యే

రెబ్బెన మండలం ఇందిరానగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 12, 13న జరిగే మహంకాళి అమ్మవారి జాతర పోస్టర్లను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ మాట్లాడుతూ.. కొమరం భీం జిల్లా భక్తుల కొంగు బంగారంగా ఉన్న కనకదుర్గమ్మ దేవి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News April 6, 2025
ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

1886: హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1928: DNAను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
1975: దర్శకుడు వీరభద్రం చౌదరి జననం
2011: తెలుగు నటి సుజాత మరణం
1896: తొలి ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్‌లో ప్రారంభం
News April 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 6, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4.54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 6, 2025
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారు

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.