News February 13, 2025
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ‘రాణి’

జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారిణి రాణి ఎంపికైనట్లు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివకుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన సెలక్షన్స్లో రాష్ట్ర కబడ్డీ జట్టులో రాణి చోటు దక్కించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాణి పాల్గొంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

AP: తమ ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేయడం, కస్టడీలో కొట్టడం తప్ప దర్యాప్తు చేయడంలేదని క్లాస్ తీసుకుంది. ఇలాంటి వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పింది. బొసా రమణ అనే వ్యక్తిపై 27 కేసులుండగా అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పూర్తి వివరాలెందుకు సమర్పించలేదంటూ నిలదీసింది.
News February 19, 2025
మహమ్మద్ నగర్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్ నగర్లో జరిగింది. SI శివకుమార్ వివరాలిలా.. మోహన్ (28) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయి, స్మశాన వాటిక వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు కేసు నమోదైంది.
News February 19, 2025
MDCL: జిల్లాలో 437.26 మెట్రిక్ టన్నుల యూరియా

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉందనేది అవాస్తవమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పంటలు సాగులో ఉన్న 8 మండలాల్లో 437.26 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లుగా తెలిపారు. వ్యాపారులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.