News March 14, 2025
జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.
Similar News
News March 22, 2025
BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TG: ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని BRS అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్‌లా తయారవ్వాలి. మోదీ నా మెడపై కత్తిపెట్టినా నేను రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.
News March 22, 2025
కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.