News March 15, 2025
జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.
Similar News
News November 25, 2025
ఎన్పీడీసీఎల్లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్కు, రమేష్ వైరా డివిజన్కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
News November 25, 2025
తిరుపతిలోని కాలేజీలకు నేడు సెలవు

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికాసేపట్లో పంచమితీర్థం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU)కి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పంచమి తీర్థం సందర్భంగా లోకల్ హాలిడే ఇచ్చామని.. తిరుపతి సిటీలోని అన్ని డిగ్రీ కళాశాలలకు సెలవు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు గమనించాలని కోరారు.


