News March 24, 2025
జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ రవీందర్ ఎంపికయ్యాడు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయి యోగా రిఫరీ డిప్లొమా పరీక్షలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 130 మంది పాల్గొనగా భైంసా ఇలేగాం వాసి అయిన రవీందర్ పాల్గొని ఉత్తీర్ణత సాధించాడు. యోగా అసోసియేషన్ ఛైర్మన్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
Similar News
News April 19, 2025
వందేళ్ల వరకు భూ సమస్య లేని విధంగా భూభారతి: కలెక్టర్ గౌతం

వందేళ్ల వరకు భూసమస్యలు లేని విధంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ గౌతం తెలిపారు. శనివారం కేశవరంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భూముల సమస్యలలో శాశ్వత పరిష్కారం భూభారతిలో జరుగుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, ఎమ్మార్వో వెంకటనరసింహారెడ్డి పాల్గొన్నారు.
News April 19, 2025
రోడ్లపై చెత్తను ఎత్తిన తిరుపతి SP

చంద్రగిరిలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు పాల్గొన్నారు. రోడ్లపై ఉన్న చెత్తను వారు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, అప్పుడే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయని పిలుపునిచ్చారు.
News April 19, 2025
ఈనెల 24తో ముగియనున్న AU EET దరఖాస్తు గడువు

సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AU EET-2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 24తో ముగియనుంది. ప్రవేశ పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్ విద్యార్హత కలిగిన విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోండి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు ఏయూ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.