News July 14, 2024
జాతీయ అవార్డు అందుకున్న RIMS వైద్యుడు

ఆదిలాబాద్ RIMS వైద్యుడు జాతీయ అవార్డు అందుకున్నాడు. RIMS పాథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డా.అరుణ్ కుమార్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎక్సలెన్స్ విభాగంలో జాతీయ అవార్డు- భారతదేశపు ఉత్తమ వైద్యుల అవార్డు 2024 అందుకున్నారు. ఈ అవార్డు కోసం దేశం నుంచి 126 నామినేషన్లు రాగా దాంట్లో డా.అరుణ్ కుమార్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. RIMS డైరెక్టర్ జైసింగ్తో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆయన్ను అభినందించారు.
Similar News
News December 2, 2025
ADB: విత్తన బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలి

ముసాయిదా విత్తన బిల్లు–2025 రూపకల్పనలో ప్రతి వర్గ అభిప్రాయం కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో రైతులు, విత్తన డీలర్లు, కంపెనీలు, రైతు ఉత్పాదక సంఘాలు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్న ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కొత్త విత్తన బిల్లు రైతు ప్రయోజనాలను కాపాడేలా, నాణ్యమైన విత్తనాల సరఫరాపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
News December 2, 2025
ఆదిలాబాద్: పెంపుడు శునకానికి పురుడు

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి పటేల్, నాగమ్మ దంపతులు ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 12న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాల్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామాకారనోత్సవం చేశారు. అనంతరం శునకానికి నైవేద్యం సమర్పించారు.
News December 1, 2025
నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


