News September 27, 2024

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం

image

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం ఎంపికైంది. ప్రపంచం పర్యాటక దినోత్సవం సందర్బంగా నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా అవార్డును నంద్యాల ఇంటాచ్ చాప్టర్ కన్వీనర్ శివ కుమార్ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి లంజ్వంతి నాయుడు కలిసి అందుకున్నారు.

Similar News

News October 16, 2024

కర్నూలు: అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక

image

అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళికను రూపొందించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర@ 2047 జిల్లా ప్రణాళిక రూపకల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్, హార్టికల్చర్ అభివృద్ధి, వ్యవసాయం, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

News October 15, 2024

కర్నూలు, నంద్యాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూలు కలెక్టరేట్‌లో 08518-277305, నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో 08514-293903, 08514-293908 నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. 24గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 15, 2024

కర్నూలు జిల్లా మంత్రులకు కీలక బాధ్యతలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్‌లకు CM చంద్రబాబు కీలక బాధ్యతల అప్పగించారు. వీరిని పలు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
➤ బీసీ జనార్దన్ రెడ్డి – అన్నమయ్య
➤ ఎన్ఎండీ ఫరూక్ – నెల్లూరు
➤ టీజీ భరత్ – అనంతపురం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యారు.