News July 5, 2024
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి శైలజ గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ..http//nationalaward-stoteacher. education.gov.in వెబ్సైట్ ద్వారా నిర్దేశించిన మార్గదర్శకాలు అనునరిస్తూ.. జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఒ కోరారు.
Similar News
News October 16, 2024
బాపట్ల: గ్రేట్.. చనిపోతూ 60మంది ప్రాణాలు కాపాడాడు.!
బాపట్ల డిపోకు చెందిన RTC బస్సు <<14369078>>డ్రైవర్<<>> సాంబశివరావు బుధవారం ఉదయం గుండెపోటులో మృతిచెందిన విషయం తెలిసిందే. బస్సు నడుపుతున్న సమయంలో తాను అస్వస్థతకు గురైనట్లు గమనించిన వెంటనే 60మంది ఉన్న బస్సును ఓ పక్కకు నిలిపేసి, అందులోనే మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతో, డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తిని అందరూ ప్రశంసిస్తున్నారు. డ్రైవరన్న నీకు జోహార్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
News October 16, 2024
బాపట్ల: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
బాపట్ల డిపోకు చెందిన RTC బస్సు బుధవారం రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెంలోని ఓ టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి సురక్షితంగా నిలిపాడు. అనంతరం RTC డ్రైవర్ సాంబశివరావు గుండెపోటుతో బస్సులోనే మృతిచెందాడు. ఈ బస్సులో 60 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News October 16, 2024
17 నుంచి ANUలో దూరవిద్యా పరీక్షలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యాకేంద్రంలో ఈ నెల 17 నుంచి యూజీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లతో రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గతంలో మాదిరిగా అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సూపరింటెండెంట్లు కీలకమన్నారు.