News February 8, 2025
జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి జిల్లా వాసి

కామారెడ్డి జిల్లా రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్ సాయి సేవ భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైనట్లు రక్త దాతల ఫౌండర్ డా.బాలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో ఈ పురస్కారాన్ని జమీల్ అందుకొనున్నారు.
Similar News
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<
News September 19, 2025
జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News September 19, 2025
ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. నిర్వహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరి యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.