News February 16, 2025
జాతీయ ఉపకార వేతనాలకు రాజుర బిడ్డలు ఎంపిక

లోకేశ్వరం మండలం రాజుర ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నముల్ల మనోజ్, కుంట యశస్వి, ఆర్ష దేవిక జాతీయ ఉపకార వేతనాల్లో ఎంపికయ్యారని HM రేగుంట రాజేశ్వర్ తెలిపారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు 8 నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల నగదు అందుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
అపార్ ఐడి పురోగతిని వేగవంతం చేయాలి: కలెక్టర్

పలు మండలాల్లో అపార్ ఐడి పురోగతి చాలా నెమ్మదిగా ఉందని వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె అధికారులకు సూచనలు సలహాలు చేశారు. మహానంది పగిడాల బేతంచెర్ల జూపాడుబంగ్లా శ్రీశైలం మండలాలలో చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. విద్యాశాఖ 95 శాతం లక్ష్యాన్ని సాధించే విధంగా మరింత కృషి చేయాలని సూచించారు.
News December 8, 2025
వరంగల్ ఎంజీఎంలో మరో స్కాం?

వరంగల్ MGMలో మరో స్కాంకు తెరలేపినట్లు సమాచారం. పేషెంట్ కేర్ సిబ్బంది వేతనాలు, PFచెల్లింపులో కోతలు పెడుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. 675 సిబ్బందికి రూ.12వేలు చొప్పున PF చెల్లించాల్సి ఉండగా 500 మందికి రూ.8600చెల్లిస్తూ నెలకు రూ.40లక్షలకు పైగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శానిటేషన్ సంబంధించిన బిల్లుల చెల్లింపులో పరిపాలన విభాగం ఉద్యోగి, మరో Rmoచక్రం తిప్పి రూ.4 లక్షలు జేబులో వేసుకున్నట్లు సమాచారం.
News December 8, 2025
3,131 ఉద్యోగాలు.. BIG UPDATE

SSC CHSL-2025 టైర్-1 ఆన్లైన్ పరీక్షల కీ విడుదలైంది. అభ్యర్థులు https://ssc.gov.in/లో రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్‌తో లాగినై కీ, రెస్పాన్స్‌షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి అభ్యంతరాలను తెలపవచ్చు. కాగా 3,131 ఉద్యోగాలకు నవంబర్ 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


