News April 10, 2025
జాతీయ జట్టు ప్రాబబుల్స్లో పదర యువతికి చోటు

భారత సబ్ జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ జట్టు ప్రాబబుల్స్ జాబితాలో పదర యువతికి చోటు దక్కింది. మండల కేంద్రానికి చెందిన బండి నందిని జాబితాలో 31వ స్థానంలో ఎంపికైంది. ఈ ఎంపిక పట్ల గ్రామస్థులు యువతిని అభినందించారు. తెలంగాణ నుంచి కేవలం ఈ యువతి మాత్రమే ప్రాబబుల్స్కి ఎంపికైందని గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపారు.
Similar News
News September 16, 2025
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 5-6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంగళవారం రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీంద్ర చారీ తెలిపారు. కడెం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు పెరిగిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 16, 2025
BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
News September 16, 2025
‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి’

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని నూతన కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర్ రెడ్డిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను మంత్రి ఏపీ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా వెనకబడి ఉన్న జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.