News March 29, 2024
జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు అమూల్య

బిహార్ రాష్ట్రం పాట్నాలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న 33వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా నుంచి చింతరాల అమూల్య రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అమూల్య ఎంపికకు సహకరించిన అంతర్జాతీయ క్రీడాకారుడు మహేందర్ రెడ్డికి, జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Similar News
News October 16, 2025
NLG: రేపే జాబ్ మేళా

రేపు ఉదయం 10.30 గంటలకు నల్గొండలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. జిల్లాలో పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ (అన్ని ట్రేడ్ల)లో ఉత్తీర్ణత పొందిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News October 16, 2025
NLG: వేరుశనగ.. సాగు పెంపే లక్ష్యం..!

జిల్లాలో ఏటేటా తగ్గిపోతున్న వేరుశనగ పంటల సాగును పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో రెండు 2,22,444 హెక్టార్లలో పంట సాగు చేయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. రైతులకు ఉచితంగా విత్తనాలు అందించనున్నారు. పంట నూనెల ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.
News October 16, 2025
NLG: మాధవరెడ్డి హత్య.. జనస్రవంతిలోకి ఆశన్న

మావోయిస్టు పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నిన్న ఆ పార్టీ కీలక నాయకుడు మల్లోజుల మహారాష్ట్ర CM ఎదుట 60 మందితో లొంగిపోయిన సంగతి తెలిసిందే. నేడు మరో కీలక నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అజ్ఞాతం వీడనున్నట్లు సమాచారం. ములుగు (D) చెందిన ఆశన్న IPS ఉమేష్ చంద్ర, ఎలిమినేటి మాధవరెడ్డిని హత్య చేసిన ఆపరేషన్‌కు నేతృత్వం వహించినట్లు చెబుతారు. అలిపిరి బ్లాస్ట్‌తో ఆశన్న పేరు విస్తృతమైంది.