News January 26, 2025
జాతీయ డాన్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్‌లో ప్రతిభ

ఓబులదేవర చెరువులోని జ్ఞాన సాయి పాఠశాల విద్యార్థులు పంజాబ్‌లో 15వ జాతీయ డాన్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్‌లో ప్రతిభ చాటినట్లు కరస్పాండెంట్ కృష్ణమోహన్ రెడ్డి శనివారం తెలిపారు. విద్యార్థులు శివ సుబ్రహ్మణ్యం జూనియర్స్-2 కేటగిరిలో ప్రథమ స్థానం, బద్రినాథ్ ద్వితీయ స్థానంలో గెలుపొందినట్లు తెలిపారు. విజేతలను ఉపాధ్యాయులు సన్మానించి, అభినందించారు.
Similar News
News July 6, 2025
జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.
News July 6, 2025
విజయవాడ: రాత పరీక్ష లేకుండా 170 ఉద్యోగాల భర్తీ

విజయవాడలోని AP స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు https://www.sthreenidhi.ap.gov.in/లో ఈ నెల 7 నుంచి 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ MD హరిప్రసాద్ తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,520 వేతనం ఇస్తామని, పూర్తి వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
News July 6, 2025
NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.