News November 8, 2024
జాతీయ రహదారి భూసేకరణ పూర్తిపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

వరంగల్- మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 136 జీ 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పెండింగ్ భూసేకరణ త్వరగా ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 2, 2025
ఉస్మానియా పార్కులో రాజాపూర్ విద్యార్థి ఆత్మహత్య

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రెడ్డి విజ్ఞాన్ తేజ (19) ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్ తేజ, సోమవారం రాత్రి ఉస్మానియా ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరినట్లు గ్రామస్థులు తెలిపారు.
News December 2, 2025
KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 2, 2025
KNR: ఎన్నికల బందోబస్తుపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


