News March 23, 2025
జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సిద్దిపేట- ఎల్కతుర్తి మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై జాతీయ రహదారుల శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు.
Similar News
News December 8, 2025
కడప: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కడప కలెక్టర్‌లో జరిగిన రివ్యూ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందులో భాగంగా కడప కార్పోరేషన్ సరోజినీ నగర్ వార్డు సెక్రటరీ, సింహాద్రిపురం తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెన్షన్ చేశారు. సింహాద్రిపురం డీటీ, కడప విలేజ్ సర్వేయర్‌కు మెమోలు ఇచ్చారు.
News December 8, 2025
క్రిప్టో సంస్థలపై కేంద్రం చర్యలు.. ఎంపీ మహేష్ వెల్లడి

పన్ను చెల్లించని క్రిప్టో కరెన్సీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాల వారీగా క్రిప్టో సంస్థల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలు కోరుతూ ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. 2024-25 ఏడాదిలో వసూలు చేసిన లెక్కల ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు మొదటి 2స్థానాల్లో ఉండగా, AP 10వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
News December 8, 2025
భద్రాచలం: పట్టుబడిన సుమారు రూ.కోటి నిషేధిత గంజాయి

కూనవరం రోడ్లో ఎస్ఐ సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు. బుచ్చయ్య, రమేష్, షేక్ షఫివుద్దిన్, మహమ్మద్ మోసిన్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.


