News August 8, 2024
జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు
ఉమ్మడి అనంత జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయిస్తూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తి-తాడిపత్రి 67వ జాతీయ రహదారికి రూ.15 కోట్లు, NH42 రాప్తాడు-బత్తలపల్లి మధ్య రూ.15 కోట్లు, NH42 కళ్యాణదుర్గం- మోలకమురు మధ్య రూ.29 కోట్లు, మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేసింది.
Similar News
News September 19, 2024
రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు: ఎస్పీ
ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్‌లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.
News September 19, 2024
సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభం
అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగగా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News September 19, 2024
100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?
అనంతపురం జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..