News July 22, 2024
జాతీయ రోడ్డు రవాణా శాఖ కార్యదర్శితో మంత్రి కోమటిరెడ్డి
జాతీయ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. RRR నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా కంప్లీట్ చేసేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News October 14, 2024
NLG: ఫుల్లుగా తాగేశారు
విజయదశమి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.47.13 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లాలో 11,927 మద్యం కాటన్లు, 14,687 బీర్ కాటన్లు అమ్మకాలు జరగగా రూ.12.16 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. NLG, SRPT జిల్లాల్లో 33,725 మద్యం కాటన్లు, 41,798 బీర్ కాటన్ల అమ్ముడవగా 33.97 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
News October 14, 2024
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల బంద్: మారం నాగేందర్ రెడ్డి
మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడు మారం నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి NLG జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు. కళాశాలల బిల్డింగ్ రెంట్లు, కరెంట్ బిల్లులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నామన్నారు.
News October 13, 2024
నాగర్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 43,096 క్యూసెక్కుల ఇన్లో ఫ్లో వస్తుండగా అవుట్ ఫ్లో 54,096 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 307.2834 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు ఆదివారం సాయంత్రం తెలిపారు.