News March 6, 2025
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: వరంగల్ సీపీ

కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల మార్చ్ 8న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుందన్నారు. ఇరువర్గాల కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగించుకోని సమస్యలను పరిష్కరించుకోవాలని సీపీ తెలిపారు.
Similar News
News March 21, 2025
BREAKING: పరీక్ష వాయిదా

AP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2025-26కు గాను ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీన్ని అదే నెల 13న నిర్వహిస్తామని తెలిపింది.
News March 21, 2025
‘టాక్సిక్’ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్న కియారా!

రాకింగ్ స్టార్ యశ్, కియారా కాంబోలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా మారనున్నట్లు వెల్లడించాయి. కాగా, SSMB29 కోసం ప్రియాంకా చోప్రా రూ.30 కోట్లు తీసుకుంటున్నారని టాక్.
News March 21, 2025
కన్నెపల్లి: మామ, బావమరిది కలిసి చంపేశారు

కన్నెపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చదువుల లక్ష్మణ్‌ను అతడి మామ పార్వతి రాజేశం, బావమరిది అనిల్ తీవ్రంగా కొట్టి చంపేశారు. ఎస్ఐ గంగారాం వివరాల ప్రకారం.. లక్ష్మణ్ తన భార్య రోజాతో రోజు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తన కూతురితో ఎందుకు గొడవ పడుతున్నావని శుక్రవారం రాజేశం, అనిల్ కలిసి లక్ష్మణ్ పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.