News October 22, 2024
జాతీయ స్థాయిలో గూడూరు క్రీడాకారుడు సత్తా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో నిర్వహించిన డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో గూడూరు క్రీడా కారుడు షేక్ గౌస్ సత్తా చాటాడు. హోరాహోరీగా సాగిన షటిల్ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. షేక్ గౌస్ – ప్రకాష్ రాజ్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ప్రథమ స్థానంలో శివం శర్మ, సంతోష్ జట్టు నిలిచింది. గూడూరు క్రీడాకారులను పలువురు అభినందించారు.
Similar News
News December 29, 2025
నెల్లూరు: గ్రీటింగ్ కార్డులు మాయం..!

స్మార్ట్‌ఫోన్ల యుగంలో భావాలను వ్యక్తపరిచే పద్ధతులే మారిపోయాయి. ఒకప్పుడు పండగలు, పర్వదినాలు వచ్చాయంటే చేతిలో గ్రీటింగ్ కార్డు తప్పనిసరిగా ఉండేది. కాలక్రమంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు శుభాకాంక్షల మార్పిడిని పూర్తిగా డిజిటల్‌గా మార్చేశాయి. ఒక్క క్లిక్‌తోనే సందేశం చేరుతుండటంతో గ్రీటింగ్ కార్డుల అవసరం తగ్గింది.
News December 29, 2025
సైదాపురం: బాలుడిని ఢీకొట్టిన టిప్పర్

సైదాపురం ST కాలనీ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు సమీపంలోని క్రషర్ నుంచి కంకర్ లోడుతో గూడూరు వైపు ఓ టిప్పర్ బయల్దేరింది. మార్గమధ్యంలో టిప్పర్ అదుపు తప్పి దక్షేశ్(5)పైకి దూసుకెళ్లింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 29, 2025
నెల్లూరులోకి గూడూరు.. ఆ రెండు తిరుపతిలోనే!

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నెల్లూరులో కలపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CM చంద్రబాబుతో ఆదివారం జరిగిన చర్చల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చిందంట. గూడూరు, కోట, చిల్లకూరు మండలాలనే నెల్లూరులో కలిపి.. వాకాడు, చిట్టమూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తారని సమాచారం. నేటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికార ప్రకటన చేయనున్నారు.


