News October 22, 2024

జాతీయ స్థాయిలో గూడూరు క్రీడాకారుడు సత్తా 

image

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో నిర్వహించిన డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో గూడూరు క్రీడా కారుడు షేక్ గౌస్ సత్తా చాటాడు. హోరాహోరీగా సాగిన షటిల్ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. షేక్ గౌస్ – ప్రకాష్ రాజ్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ప్రథమ స్థానంలో శివం శర్మ, సంతోష్ జట్టు నిలిచింది. గూడూరు క్రీడాకారులను పలువురు అభినందించారు.

Similar News

News November 3, 2024

నెల్లూరులో ఎన్టీఆర్ పార్క్ ప్రారంభోత్సవం

image

నెల్లూరు 19వ డివిజన్ అన్నమయ్య సర్కిల్ లోని మాగుంట లేఔట్ నందు ఉన్న నందమూరి తారక రామారావు పార్క్ ను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నవంబర్ 3వ తేదీ ఆదివారం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు శనివారం ప్రకటనలో తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News November 2, 2024

4 నుంచి SMP పరీక్షలు: నెల్లూరు DEO

image

సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-2 (SMP) పరీక్షలు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సొంత ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 

News November 2, 2024

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సివిల్ సప్లయిస్ సంస్థ డీఎం నర్సింహరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ 37,978 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. 1,29,583 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం 2024-25 సీజన్‌కు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరగా ప్రకటించిందన్నారు.