News February 16, 2025
జాతీయ స్థాయి పోటీలకు ఏటూరునాగారం బిడ్డలు ఎంపిక

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏటూరునాగారానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారని కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన సాయిరాం, నరేంద్ర చారి, సంజయ్, రామయ్య, ప్రేమ్ సాగర్, అర్జున్ ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కాగా క్రీడాకారులను స్థానికులు అభినందించారు.
Similar News
News April 10, 2026
ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.
News April 10, 2026
నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఎమ్మెల్యే బత్తుల

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్‌కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2026
జనగామ నేతలతో TPCC చీఫ్ సమావేశం

గాంధీభవన్‌లో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల కమిటీల నియామక ప్రక్రియ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు మహేశ్ కుమార్ గౌడ్ దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నేతలు పాల్గొన్నారు.


