News January 28, 2025
జాతీయ స్థాయి పోటీలకు సిద్దిపేట బిడ్డ

38వ జాతీయ స్థాయి ఉమెన్స్ రోడ్ సైకిల్ గేమ్స్‌కు సిద్దిపేట ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న కే.స్నేహ ఎంపికైనట్లు శిక్షకులు సంజీవ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న వారికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటే జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణిస్తారన్నారు.
Similar News
News December 3, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
మెదక్: తండ్రీకొడుకుల మధ్య సర్పంచ్ పోటీ

రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తండ్రీకొడుకులు పోటీ పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామానికి చెందిన మానెగళ్ళ రామకృష్ణయ్య, ఆయన కొడుకు వెంకటేష్ నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామంలో మొత్తం 10 వార్డులు, 1563 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌కి తండ్రి కొడుకు పోటీ చేయడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


