News October 3, 2024
జాతీయ స్థాయి ప్లోర్ బాల్ పోటీలలో నంద్యాల జిల్లా పగిడ్యాలకు ద్వితీయ స్థానం

తమిళనాడులోని చెంగల్పట్టులో సెప్టెంబర్ 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ప్లోర్ బాల్ పోటీలలో నంద్యాల జల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులం విద్యార్థినుల అఖిల, అక్షయ ద్వితీయ స్థానంలో నిలిచారనీ ఈమేరకు పీఈటీ లావణ్య వెల్లడించారు. దీంతో అఖిల, అక్షయను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.
Similar News
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బస్సు ప్రమాద ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి: SV

కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బైకర్ శివ శంకర్ లక్ష్మీపురం వద్ద బెల్టు షాపులో మద్యం తాగి వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారని వాపోయారు. రాష్ట్రంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని ఆరోపించారు. ఎక్సైజ్ మంత్రిపై కేసు నమోదు చేసి, బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.