News December 7, 2024
జాతీయ స్థాయి యోగా పోటీలకు తణుకు విద్యార్థుల ఎంపిక

ఇటీవల రాజమండ్రిలో సౌత్ జోన్ యోగా ఎంపికల్లో తణుకు ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సుందరి బాయ్ తెలిపారు. ఎంపికైన భవానీ ప్రసన్న, నాగలక్ష్మి దుర్గ, జ్యోతి, సౌమ్య నాగవల్లి ఈనెల 24 నుంచి 27 వరకు భువనేశ్వర్ కిట్టి యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఎంపికలకు హాజరవుతారని చెప్పారు. వీరిని కళాశాల సెక్రటరీ చిట్టూరి సత్య ఉషారాణి శుక్రవారం అభినందించారు.
Similar News
News October 14, 2025
ఆదర్శ గ్రామాలలో పనులు చేపడతాం: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 11, రెండో విడతలో 14 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేస్తామన్నారు. మొదటి విడత 11 గ్రామాలకు బడ్జెట్ను కేటాయిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో పనులను చేపట్టి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
News October 14, 2025
ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజాబాబు (9705649492) కి తెలపాలని జీఆర్పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 14, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్ఎస్లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.