News January 25, 2025
జాతీయ స్థాయి రన్నింగ్ పోటీకి రామక్కపేట ఉపాధ్యాయుడు

దుబ్బాక మండలం రామక్కపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచర్గా పని చేస్తున్న నర్సింలు జాతీయ స్థాయి రన్నింగ్ పోటీకి ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ రన్నింగ్లో 400 మీటర్ల దూరాన్ని 1 నిమిషం 16 సెకన్లలో పూర్తి చేశారు. రన్నింగ్లో తనదైన ప్రతిభ చాటుతూ భారతదేశంలో ప్రతిష్ఠాత్మక ముంబై మారథాన్లో పాల్గొనున్నారు.
Similar News
News December 9, 2025
సిద్దిపేట: 4 సార్లు ఓటమి.. అయిన సర్పంచ్ బరిలోకి!

బెజ్జంకి గ్రామ సర్పంచ్ పదవికి గతంలో నాలుగు సార్లు ఓటమి చెందిన కొండ్ల వెంకటేశం ఈసారి కూడా వెనుదీరగకుండా ఐదవసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. 1995, 2001, 2006, 2019లో ఓటమి చవిచూసిన ఆయన, ఇప్పుడు జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. తనకు ఉన్న సానుభూతితో తప్పకుండా విజయం సాధిస్తానని వెంకటేశం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News December 9, 2025
ఉమ్మడి గుంటూరులో స్క్రబ్ టైఫస్

గుంటూరు జిల్లా వెనిగండ్ల, నరసరావుపేట మండలం ములకలూరులలో స్క్రబ్ టైఫస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అనారోగ్యంతో జీజీహెచ్లో చేరిన ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News December 9, 2025
నంద్యాల: ఘోర ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

డోన్ మండలం కొత్తపల్లి బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


