News December 21, 2024
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏపీ జట్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734704853354_60265272-normal-WIFI.webp)
ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్‌లో ఏపీ జట్టు పాల్గొంటున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కర్నూలులో జట్టు క్రీడాకారుల వివరాలు తెలిపారు. జట్టులో సీహెచ్ దేవిక, జీ.దేవి, ఎస్.పుష్ప, సీహెచ్ గాయత్రి, వెంకటలక్ష్మి, ఝాన్సీ, రిషిత, జ్యోతి, హన్సిక, అనన్య, త్రివిధ, లక్ష్మీ, శ్రీవాణి, షాహిదా ఉన్నారన్నారు.
Similar News
News January 25, 2025
హత్యకు గురైన ఈరన్నకు వైసీపీ నేతల నివాళి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737795878613_51138598-normal-WIFI.webp)
ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గ్రామంలో ఈరన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
News January 25, 2025
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య.. కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737771288008_727-normal-WIFI.webp)
ఆలూరు మండలం అరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు ఉద్యోగ విషయంలో నెలకొన్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వదిలేయాలంటూ టీడీపీ నేతలు ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లేకుంటే హత్య చేస్తామని బెదిరించి చివరకు అన్నంతపని చేశారని వాపోయారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.
News January 25, 2025
విషాదం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737741740896_51138598-normal-WIFI.webp)
కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. ఈ ఘటనలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి భర్య వాణి, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గూడూరు మండలం రేమట గ్రామానికి చెందిన వారు. వారి బాబాయ్ అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం.