News February 6, 2025
జానకిరాంపురం పీఏసీఎస్ సిబ్బంది సస్పెన్షన్: సీఈవో వర్మ

రోలుగుంట మండలం జానకిరాంపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యదర్శి బి. రామకృష్ణ, గుమస్తా మడక దేవుడును సస్పెండ్ చేసినట్లు డీసీసీబీ సీఈవో వర్మ తెలిపారు. సొసైటీ నిధులు దుర్వినియోగంతో పాటు నర్సీపట్నం డీసీసీబీలో <<15362575>>పెట్రోల్తో దాడి <<>>చేసిన ఘటన నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారని తెలిపారు.
Similar News
News October 21, 2025
నేడు..

* మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
* హైదరాబాద్లోని గోషామహల్లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో నివాళులు అర్పించనున్న టీజీ సీఎం రేవంత్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే ఆఖరు.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
* ఇవాళ WWCలో తలపడనున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్
News October 21, 2025
మెదక్: 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరక అజయ్ కుమార్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
అరక జ్యోతి, సంజీవరావు కుమారుడు అజయ్ కుమార్ 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శిగా విధుల్లో చేరాడు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, 2023లో ఎస్ఐ, గ్రూప్-2లో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు.
News October 21, 2025
విజయనగరం జిల్లాలో 229 మందికి పదోన్నతులు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సహా 23 కేటగిరీల సిబ్బందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్థానిక డీపీటీఓ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ 229 మందిని ఎంపిక చేసే కసరత్తును మొదలుపెట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు.