News January 24, 2025

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

image

మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు దర్గాలో సైదులు బాబా సమాధులపై చాదర్‌ను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వక్ఫ్ బోర్డ్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 22, 2025

వేదవాక్కులే శిరోధార్యాలు

image

వేదం నుంచి జ్ఞానం, సంస్కృతి, జీవితానికి సంబంధించిన మార్గదర్శకాలు, అనేక ఇతర విషయాలు ఉత్పన్నమవుతాయి. వేదం అనేది సంస్కృత మూల పదం ‘విద్’ నుంచి వచ్చింది. వేదం వల్ల ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు లోకమంతా వ్యాపించి సత్ఫలితాలనిస్తాయి. రోగాలు సహా అనేక బాధల నుంచి విముక్తిని ప్రసాదించే శక్తి వేద మంత్రాలకుంది. భగవంతుని ఉచ్వాస నిశ్వాసాలే వేదాలు. అందుకే సకల మానవాళికి వేద వాక్కులు శిరోధార్యాలు.
<<-se>>#VedicVibes<<>>

News October 22, 2025

పరవాడ సమీపంలో పేకాట శిబిరంపై దాడి: సీఐ

image

పరవాడ మండలం నక్కవానిపాలెం సమీపంలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సీఐ మల్లిఖార్జునరావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని రూ.19 లక్షల నగదు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 22, 2025

విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.