News January 23, 2025

జాన్ పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ఠ భద్రత: SP

image

పాలకీడు మండలం జాన్ పహాడ్‌లో దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ దర్గాను పరిశీలించారు. ఉర్సుకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ చరమంద రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 22, 2025

చిన్న శంకరంపేట: తాత హయాంలో నిర్మాణం.. మనుమడి హయాంలో హంగులు

image

చిన్నశంకరంపేట జీపీ సర్వంగ సుందరంగా ముస్తాబయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ తాత కంజర్ల శంకరప్ప రెండవసారి సర్పంచ్ గా పదవీలో కొనసాగుతున్నప్పుడు 01 నవంబర్ 1977 నాటికి గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టారు. ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కోదాటి రాజమల్లు ప్రారంభోత్సవం చేశారు. తాత నిర్మాణం చేపట్టిన జీపీలో మనుమడు పదవి చేపట్టడం కొసమెరుపు.

News December 22, 2025

UPDATE: 9 నెలల బాబు విక్రయం కేసులో ఐదుగురి అరెస్ట్

image

NZBలో 9 నెలల బాబును విక్రయించిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లుNZB వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ బాబును విక్రయించారు. వారిద్దరితో పాటు మధ్యవర్తులుగా ఉండి బాబును విక్రయించిన రెహనా బేగం, సర్ తాజ్ అన్సారీ తో పాటు కొనుగోలు చేసిన సలావుద్దీన్ ఖురేషీని అరెస్ట్ చేశామన్నారు.

News December 22, 2025

మహబూబ్‌నగర్: నేడు జిల్లాకు ఐదుగురు మంత్రుల రాక

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, జి.వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్పనపల్లిలో గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందుల పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం పిల్లలమర్రి సమీపంలో ఉన్న ఎండీసీఏ గ్రౌండ్‌లో ‘కాకా స్మారక క్రికెట్ టోర్నీ’ని మంత్రులు ప్రారంభించనున్నారు.