News January 23, 2025
జాన్ పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ఠ భద్రత: SP

పాలకీడు మండలం జాన్ పహాడ్‌లో దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ దర్గాను పరిశీలించారు. ఉర్సుకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ చరమంద రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 16, 2025
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం రానుంది. సా.5.30 గంటలకు జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
News February 16, 2025
యాగం చేసిన అనకాపల్లి ఎంపీ

లోక కల్యాణార్థం సుదర్శన లక్ష్మీనరసింహ, లక్ష్మీ గణపతి, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా వీటిని నిర్వహించామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు వర్ధిల్లాలని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఈ యాగం చేశామన్నారు.
News February 16, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వారం రిలీజైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.