News April 9, 2025

జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

image

ఈనెల 11న వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్‌లో జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈనెల 11న ఉదయం 9:30 గంటల నుంచి జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై నిర్వాహ‌కులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 16, 2025

కామారెడ్డి: చికెన్, మటన్ ధరలు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, ఉండగా చికెన్ స్కిన్ రూ.210 -220, స్కిన్ లెస్ రూ.230-240, లైవ్ కోడి రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విక్రయాలు సాధారణంగా ఉన్నాయని దుకాణాలు తెలిపారు.

News November 16, 2025

గద్వాల్ స్టేషన్‌లో ఆగే రైళ్లు ఇవే..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT

News November 16, 2025

రేపు తిరుచానూరుకు రాష్ట్ర మంత్రి రాక..

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3 నుంచి 5 గంటల వరకు తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.