News January 6, 2025

జామ చెట్టుకు గుమ్మడికాయలు..!

image

జామ చెట్టులో గుమ్మడికాయలు కాయడం ఏంటని వింతగా చూస్తున్నారా? అవునండీ పైన కనిపిస్తున్న చిత్రం ఆదివాసీల జీవన ప్రమాణాలపై వారి ముందు చూపు, ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోయరాజులలో ఓ గిరిజన రైతు పండించిన గుమ్మడి కాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పెరటిలో ఉన్న జామ చెట్టుకి గుమ్మడి కాయలను వేలాడ దీశాడు. దీంతో అవి చెడిపోకుండా ఉంటుందట.

Similar News

News October 16, 2025

వందేళ్ల ప్రస్థానం: ఆంధ్రా వర్సిటీ వైభవం

image

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) ఒక విజ్ఞాన ఖని. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నాణ్యమైన విద్యను ఏయూ అందిస్తోంది. మెరైన్, బయాలజీ వంటి ప్రత్యేక కోర్సులకు నిలయం. వెంకయ్య నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు ఇక్కడి పూర్వ విద్యార్థులే. శతాబ్ద కాలంగా ఈ విజ్ఞాన ఖని బాధ్యతగల పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతూ ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తోంది.

News October 16, 2025

విశాఖ: ‘పవన్‌ కళ్యాణ్‌ను కలిసేదాకా ఊరెళ్లను’

image

బెట్టింగ్‌ యాప్‌ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ విశాఖ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వెళ్లాడు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్‌ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.

News October 16, 2025

విశాఖలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

image

షీలానగర్-సబ్బవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే విస్తరణతో విశాఖలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. షీలానగర్ నుంచి సబ్బవరం నేషనల్ హైవేకి 13KM మేర సిక్స్‌ లేన్ రోడ్డు వేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.964 కోట్లు మంజూరు చేయగా.. PM మోదీ నేడు కర్నూలు జిల్లా నుంచి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి పూర్తయితే విశాఖ పోర్టు నుంచి కార్గో నగరంలోకి రాదు. గాజువాక, విమానాశ్రయం వైపు వెళ్లే వారి ప్రయాణం సుగమం అవుతుంది.